టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కొరటాల శివమూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా పూర్తిగా క్లోజ్ కాకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తారు.

ఎప్పుడు దేశ వ్యాప్తంగా ఈ మూవీ కి సంబంధించిన ప్రచారాలను పూర్తి చేస్తారో అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. మరి ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్లకు సంబంధించి పక్క ప్లానింగ్ తో ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఐదు , పది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఆ తర్వాత ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్లను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వినాయక చవితి లోపే ఈ సినిమాకు సంబంధించిన మూడవ సాంగ్ ను విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు , ఆ తర్వాత ట్రైలర్ ను విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. దానితో ఈ మూవీ ప్రచారాలకు కూడా ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. మరి ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్లను ఎంత పక్కాగా నిర్వహిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: