తెలుగు ఇండస్ట్రీలో సమంత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరసం లేదు.. ఇప్పడూ ఇప్పుడే సమంత మళ్ళి తిరిగి సినిమాలు చేసే కోసం ముందుకు వస్తుంది. మన తెలుగులో సమంత చివరిగా చేసిన సినిమా 'ఖుషీ'. గత కొన్ని రోజులుగా సమంత మయోసైటిస్ చికిత్స తీసుకుని విశ్రాంతి తీసుకున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అలాగే మరో వైపు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ నిత్యం వర్కవుట్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఎంతగానో ఖుషి చేసేది. అలాగే ఇటీవలే జరిగిన ఓ అవార్డు ఈవెంట్ లో పాల్గొన్న సమంత న్యూలుక్ చూసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

మొన్నటివరకు బెడ్డు మీద నుంచి నడవలేని స్థితిలో ఉన్న సమంత, ప్రస్తుతం మాత్రం సమంత ఆటలు ఆడుతూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. తాజాగా సామ్ లుక్, ఫిట్ నెస్ పూర్తిగా మరిపోయాయి అనే చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో సమంత తన స్నేహితులతో కలిసి టెన్నిస్ ఆడుతూ ఉండడం మనం చూడవచ్చు. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో సామ్ తన స్నేహితులతో కలిసి ఫుల్ జోష్ లో పికిల్ బాల్ గేమ్ ఆడుతూ ఉండడం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియోలో సమంతను చూస్తే  పూర్తి ఫిట్ గా ఉందని క్లియర్ గా అర్థమవుతుంది. అంతేకాకుండా.. ఈ
పికిల్ బాల్ గేమ్ అనంతరం డాన్స్ కూడా చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది సమంత.

అయితే., ఇప్పటికే వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడి స్టేడియంలో పలువురు ఛాంపియన్లతో కలిసి ఆమె ఓ మ్యాచ్ కూడా ఆడారు. ఇదిలా ఉంటే మరో వైపు సమంత నటించిన సిటాడెల్ షూటింగ్ అంతా కూడా పూర్తి అయిపోయింది. అతి త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను తెలియచేస్తారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. మా ఇంటి బంగారం సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. అంతే కాకుండా తమిళం, మలయాళంలో పలు ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: