కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇటీవలే తన పార్టీ జెండాల సైతం ఆవిష్కరించడం జరిగింది.. అయితే ఇలా ఆవిష్కరించారో లేదో ఇప్పుడు తాజాగా బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ జెండా పైన తమ గుర్తు ఉందంటూ ఏనుగు గుర్తును ముద్రించారు అంటూ బీఎస్పీ షాక్ ఇచ్చింది.. విజయ్ పార్టీ జెండాలో ఆ ఏనుగు గుర్తును ఉపయోగించడం అభ్యంతరకరాన్ని తెలియజేస్తోంది బిఎస్పి (బహుజన సమాజ్ వాదీ) పార్టీ.. ఆ ఏనుగు గుర్తు తమ పార్టీ యొక్క చిహ్నంగా ఉన్నదని వాటిని విజయ్ పార్టీ జెండా పైన ఉండకూడదు వెంటనే తొలగించాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.


మరి ఈ విషయం పైన తమిళనాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు సైతం పిటిషన్ వేశారట. ఈ విషయం పైన విజయ్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు చూడాలి. తమిళనాడులో వెట్రి కజగం పేరుతో పార్టీని సైతం ఆవిష్కరించారు విజయ దళపతి.. 2026 అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్ అన్నట్లుగా తెలియజేశారు. అలా అంచలంచెలుగా పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నారు విజయ్ దళపతి. తమిళనాడులో తమ పార్టీ సభ్యత్వాన్ని కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.


రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించి మీటింగ్లను కూడా ఏర్పాటు చేయాలని హీరో విజయ్ ప్లాన్ చేస్తున్నారు. హీరో విజయ్ పార్టీ జెండాలో ఏనుగు బొమ్మ గుర్తును ఉపయోగించారని అది మా పార్టీ చిహ్నం అని అందుకే వాటిని తొలగించాలని కూడా బీఎస్పీ పార్టీ డిమాండ్ చేస్తూ నిరసనలను తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయం పైన ఇప్పటి వరకు విక్టరీ అసోసియేషన్ తమిళనాడు నుంచి ఎలాంటి సమాధానాలను తెలుపలేదు. మరి ఈ విషయం పైన ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని విషయం పైన అభిమానులు ఎదురుచూస్తున్నారు. విజయ్ పార్టీ పెట్టడంతో తమిళ రాజకీయాలలో చాలా ఉత్కంఠత పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: