కాజల్ అగర్వాల్ తల్లైనా తన స్టార్డం ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. రీసెంట్ గానే ఇండియన్ -2 మూవీ తో వచ్చినప్పటికీ ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర అంతగా ప్రాధాన్యత లేదు.ఇక ఇండియాన్ -3 లో కాజల్ కి ప్రాధాన్యత ఉంటున్నట్లు తెలుస్తోంది.అలాగే రీసెంట్ గా సత్యభామ అనే వెబ్ సిరీస్ తో కూడా మన ముందుకు వచ్చింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మని ఓ పెద్దాయన పబ్లిక్ లోనే అసభ్యంగా టచ్ చేస్తూ ముద్దు పెట్టుకున్న వార్త సంచలనం సృష్టిస్తుంది. అయితే ఈ వీడియో, వార్త ఇప్పటిది కాకపోయినప్పటికీ మళ్లీ ప్రస్తుతం సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీడియో చక్కర్లు కొట్టడంతో మరోసారి ఈ విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.ఇక విషయంలోకి వెళ్తే..కాజల్ అగర్వాల్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి కవచం అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. 

అయితే ఈ సినిమా ఈవెంట్లో సినిమాటోగ్రాఫర్ చోటా. కె. నాయుడు అందరూ చూస్తుండగా నే పబ్లిక్ లోనే కాజల్ ని పట్టుకొని ముద్దు పెట్టడం అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. అంతేకాదు ఈయన ప్రవర్తనపై కాజల్ అభిమానులు ఫైర్ అయ్యారు. అయితే ఈ విషయంపై స్పందించిన చోటా కె నాయుడు నేను కాజల్ ని తప్పుగా ఏమీ భావించలేదని, ఆమె తన కొత్త సినిమాకి సంబంధించిన విషయాన్ని ప్రకటించేసరికి ఆనందం ఆగబట్టుకోలేక అలా చేశానని,నేను కాజల్ కి ఫ్యామిలీ ఫ్రెండ్ ని అని, ఆమెతో నాకు చాలా మంచి బంధం ఉందని,దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఆయన ఖండించారు.

ఇక కాజల్ ని స్టేజిపై అలా ముద్దు పెట్టుకున్న సమయంలో కాజల్ కూడా స్టాప్ చోటా.. నువ్వు నా ఫ్యామిలీ మెంబర్..అంటూ నవ్వింది. కానీ ఆయన అలా ముద్దు పెట్టుకున్న సమయంలో మాత్రం ఒక్క సెకండ్ కాజల్ షాక్ లో మునిగిపోయింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంలో చాలామంది చోటా కె నాయుడు పై మండిపడ్డారు. చోటా కె నాయుడు చాలామంది హీరోయిన్లతో ఇలాగే ప్రవర్తిస్తాడని కూడా ఆయనను తిట్టిపోసారు. ఏది ఏమైనప్పటికీ అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ వీడియో మళ్లీ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి: