తెలుగు మరియు తమిళ భాషల్లో త్రిష స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియర్ సెల్వం రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. లియో సినిమా సక్సెస్ తో త్రిష డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్, మోహన్ లాల్ సినిమాలలో నటిస్తూ బిజీ అయిపోయింది త్రిష. చిరుతో విశ్వంభర సినిమాలో నటిస్తోంది బ్యూటీ.

 ఇక ప్రస్తుతం త్రిష విజయ్  గోట్ సినిమాలో  నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో త్రిష ఐటమ్ సాంగ్ చేస్తుందని డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే స్టార్ హీరోయిన్గా అవకాశాలు తగ్గినాక త్రిష దగ్గరికి ఐటం సాంగ్ చేయమని ఎంతోమంది పెద్దపెద్ద దర్శకులు వచ్చారట. కానీ ఎవరికీ కూడా త్రిష ఓకే చెప్పలేదు. అయితే ఫస్ట్ టైం విజయ్ గోట్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుందంటే వీరిద్దరి మధ్య ఏదో బలమైన రిలేషన్ ఉందని…. అందుకే ఇప్పటివరకు ఎవరితోనూ ఐటమ్ సాంగ్ చేయని త్రిష ఇప్పుడు విజయ్ సినిమాలో చేయడానికి ఒప్పుకుందంటే సంథింగ్ ఏదో ఉందని

 ప్రచారం జరుగుతుంది. ఇక ఇందులో ఇంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కోలీవుడ్ హీరో విజయ్ కి, స్టార్ హీరోయిన్ త్రిషకి మధ్య ఏదో ఉందని టాక్. వీరిద్దరి కాంబినేషన్లో లియో మూవీ వచ్చినప్పటి నుంచి ఈ ప్రచారం జరుగుతూనే ఉంది.  తార త్రిష  వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ భామ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని స్టార్ హీరోయిన్ గా నిలబడింది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో నటించింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: