సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన నటీమణులలో సమంత ఒకరని చెప్పుకోవచ్చు. తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంతసినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ కోనేళ్ళపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగించింది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో సైతం సమంతకు అభిమానులు ఉన్నారు. సమంతను అభిమానించే హీరోలు హీరోయిన్లు ఉండడం విశేషం.


అలాంటి వారిలో బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ ఒకరు. ఈవిడ నిజజీవితం గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ చాలా ఆసక్తిగా ఉంటారు. ఉర్ఫీ జావేద్ లైఫ్ స్టైల్ మిగతా నటీమణులందరికీ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె జీవిత నేపథ్యంపై ఒక కొత్త వెబ్ షో రానుందన్న సంగతి మన అందరికీ తెలిసిందే. దాని పేరు ''ఫాలో కర్ లో యార్". ఆగస్టు 23 నుంచి ఈ షో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది.


ఇందులో ఉర్ఫీ జావేద్ నిజ జీవితానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉర్ఫీ జావేద్ ఈ వెబ్ షో ప్రమోషన్ పనుల్లో చాలా బిజీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కోసం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. సమంత నేను ఇన్ ఇన్ స్టాగ్రామ్ లో స్నేహితులం. సమంతకు తన వీడియో నచ్చితే తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తుందని తెలపడం జరిగింది. దీని వెనుక ఎలాంటి ఉద్దేశం ఉందని నేను అనుకోవడం లేదని ఊర్పీ చెప్పింది. నేను ఆమెతో పలుసార్లు ఇన్ స్టాగ్రామ్ లో ముచ్చటించానని ఉర్ఫీ జావేద్ తెలిపింది.


కాగా వెరైటీ డ్రెస్ లలో నిత్యం వార్తలో నిలిచే ఉర్ఫీ జావేద్ ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమె మరో విషయాన్ని వెల్లడించింది. అర్జున్ కపూర్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆయనపై చాలా ప్రేమ ఉందని తన ప్రేమను ఓపెన్ గా చెప్పేసింది. ప్రస్తుతం ఉర్ఫీ జావేద్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: