ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రాల్లో ‘పుష్ప-2’ కూడా ఒకటి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ భరతం పట్టడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తనదైన శైలిలో తెరకెక్కించి మరోసారి మాస్ ఊచకోతతో ప్రేక్షకులను స్టన్ చేసేందుకు సిద్ధమవుతున్నవాడు. ఇందులో భాగంగానే  ‘పుష్ప-2’కి కొనసాగింపుగా పుష్ప-3 ఉంటుందనే వార్త ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు అభిమానులు కూడా ‘పుష్ప-3’పై

 చర్చిస్తున్నారు. మరి నిజంగానే సుకుమార్ అండ్ టీమ్ ‘పుష్ప-2’కి కొనసాగింపుగా ‘పుష్ప-3’ని ప్లాన్ చేస్తున్నారా అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరోవైపుసినిమాలో వచ్చే ఒక్కో యాక్షన్ ఎపిసోడ్‌.. ఆడియెన్స్‌ను సీట్లో కూర్చోకుండా చేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ అమ్మవారి గెటప్‌లో వచ్చే గంగమ్మ జాతర సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని, జపాన్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మామూలుగా ఉండవని మేకర్స్ అంటున్నారు. ఇక క్లైమాక్స్‌కు మాత్రం ‘పోతారు.. మొత్తం పోతారు’ అని అంటున్నారు. ఇటీవల ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమా ఈవెంట్‌లో

 పాల్గొన్న అల్లు అర్జున్, సుకుమార్.. పుష్ప 2 క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోందని చెప్పారు. ఈసారి మరో వేరే లెవెల్ అని చెప్పుకొచ్చారు. అభిమానులకు ఈ చిత్రం అంకితం అని బన్నీ పేర్కొన్నారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో  పుష్ప2 క్లైమాక్స్ గురించే చర్చ నడుస్తోంది. అయితే ఓ అభిమాని పుష్ప2 క్లైమాక్స్ గురించి ప్రస్తావిస్తూ.. ‘సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది, ఇచ్చి పడేసారు అని టాక్. ఏమంటావ్ పుష్పరాజ్?. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంటుందో ఒక హింట్ ఇవ్వొచ్చుగా?’ అని పుష్ప అఫీషియల్   హ్యాండిల్‌ను ట్యాగ్ చేశాడు. దీనికి మేకర్స్ రిప్లే ఇచ్చారు. న్యాచురల్ స్టార్ నాని తాజాగా మూవీ ‘సరిపోదా శనివారం’ నుంచి.. ‘పోతారు.. మొత్తం పోతారు’ అనే డైలాగ్‌ను షేర్ చేశారు. దీంతో పుష్ప2 క్లైమాక్స్‌పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: