పుష్ప’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా అవతరించాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. ఈ సినిమాతో బన్నీ దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో ఇప్పుడు బన్నీ సినిమాలకు మాములు డిమాండ్ లేదు. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు అన్ని ఇండ‌స్ట్రీల‌లో అల్లు అర్జున్ సినిమా వస్తుందంటే ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. అయితే అల్లు అర్జున్ ప్ర‌స్తుతం ‘పుష్ప’ సీక్వెల్‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా.. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల

 ముందుకు రానుంది. ఇక ఈ సినిమా అనంత‌రం ‘జవాన్‌’ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ మూవీ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ మధ్య ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఈ క్రేజీ కాంబో క్యాన్సిల్ కాలేదని ఈ మధ్య క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు సినిమా ఉంటుందా?.. ఉండదా.. అనేది మరో రెండు మూడు రోజుల్లో తేలిపోనుందట. అట్లీ సినిమా ఓకే అయితే.. త్రివిక్రమ్ సినిమా కంటే ముందే మొదలయ్యే ఛాన్స్ లేకపోలేదు. షారుఖ్ ఖాన్ ‘జవాన్‌’ మూవీతో

 వెయ్యి కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయిన అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మూవీ లవర్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప2 వంటి క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత అట్లీతో బన్నీ సినిమా ఉంటే.. మామూలుగా ఉండదు. బన్నీ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ అయింది. డిసెంబర్ 6న పాన్ ఇండియా బాక్సాఫీస్ దడదడలాడిపోనుంది. అయితే సినిమా షూటింగ్ విషయంలోనే కాస్త డౌట్స్ ఉన్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: