"గమ్యం" సినిమా ఫ్లాప్ అయితే అమెరికా వెళ్లి జాబ్ చేసుకునే వాడినంటూ క్రిష్ జాగర్లమూడి సంచలన వాక్యాలు చేశారు. జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వం వహించిన గమ్యం సినిమా గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతగానో ఆదరించారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్రను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. కేవలం హాస్యానికి మాత్రమే వాడుకునే అల్లరి నరేష్ ను ఓ లుంపెన్ క్యారెక్టర్ లో అద్భుతంగా చూపించారు.


నక్సలైట్లకు, పోలీసులకు మధ్య జరిగే ఎన్కౌంటర్ సీన్ ఉత్పన్నం కావడానికి గల నేపథ్యాన్ని దర్శకుడు రూపుదిద్దున తీరుని చూస్తే సినిమాకు లేదా ఏ కలకైనా అతివ్యాప్తి దోషాన్ని నివారించడం ఎలాగో తెలుసుకోవచ్చు. ఎన్కౌంటర్లో ఏ సంబంధం లేని శ్రీను బలి కావడం ప్రేక్షకుల హృదయాలను కలవరపెడుతోంది. అయితే గమ్యం సినిమా ఆ సమయంలో మంచి విజయాన్ని అందుకుంది.

ఇదిలా ఉండగా.... గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి "నా ఉఛ్ఛ్వాసం కవనం" కార్యక్రమంలో పంచుకున్నారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.... సినిమా వారం రోజులు ఉండగా ఫస్ట్ షో వేసాము. ఫస్ట్ హాఫ్ అయింది. సిరివెన్నెల గారు పిలిచి భుజం మీద చేయి వేసి సినిమా బాగుందా.... బాలేదా.... అని ఎవరిని అడగకు. గొప్ప సినిమా తీశావు. సెకండ్ హాఫ్ అయ్యాక నన్ను కలువు అని అన్నారని తెలిపారు. సినిమా పూర్తయ్యాక హాగ్ చేసుకుని నేను చెప్పిన ప్రతిదీ నువ్వు విన్నావు.

కానీ నేను చెప్పింది సినిమాలో లేదని... నువ్వు ఏ కథ అయితే తీయాలి అనుకున్నావో అదే తీశావు. కానీ నాతో ఎందుకు అన్ని సార్లు మీటింగ్ పెట్టావు అని అన్నారు. నేను తీసిన గమ్యం సినిమా మొత్తాన్ని ఒక పాటలో రాసేశారని చెప్పుకొచ్చారు క్రిష్‌. ఆయన సాహిత్యంలో ఉన్న గొప్పదనం అది. గమ్యం సినిమా గమ్యం చేరకపోయి ఉంటే మళ్ళీ అమెరికా వెళ్లి జాబ్ చేసుకునేవాడిని. 'గమ్యం సినిమాకి స్క్రిప్ట్ డాక్టర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి' అంటూ చెప్పుకొచ్చారు క్రిష్ జాగర్లమూడి.

మరింత సమాచారం తెలుసుకోండి: