ఆండ్రియా జెరోమియా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గాయనీగా సినీ రంగ ప్రవేశం చేసి కొంతకాలంగా సౌత్ ఇండియన్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తన నటనకు తోడు సాహసాలు చేయడంతో అతి తక్కువ సమయంలోనే నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. కందా నాల్ ముదల్ అనే తమిళ సినిమాతో 2005లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆండ్రియా మంచి గుర్తింపు తెచ్చుకుంది.


తమిళంతో పాటు తెలుగు, మలయాళ వంటి సినిమాల్లో నటించి మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ జాబితాలో నిలిచింది. ప్రస్తుతం ఆండ్రియా చేతిలో ఐదారు సినిమాలకు పైనే ఉన్నాయట. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. టాలీవుడ్ తో పోల్చితే ఆండ్రియాకు ఇతర భాషల్లో ఎక్కువ సినిమా ఆఫర్లు వస్తున్నాయి. చేసిన ప్రతి పాత్రకు న్యాయం చేసే విధంగా తన అందాల ఆరబోత చేస్తూ ఈ అమ్మడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఆండ్రియా అతి చిన్న వయసులోనే గాయనిగా తన సినీ ప్రయాణం మొదలుపెట్టింది.


ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాలు, అద్భుతమైన పాటలు పాడి బెస్ట్ సింగర్ గా ఎన్నో అవార్డులను సైతం గెలుచుకుంది. ఈ క్రమంలోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మరీ ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన బొమ్మరిల్లు, దడ, కింగ్ సహా ఎన్నో చిత్రాల్లో పాటలు పాడింది. ఆండ్రియా జెరోమియా సినిమాల కంటే ఎఫైర్ల కారణంగానే ఎక్కువగా సెన్సేషన్ అయింది. ఆ మధ్య సుచీ లీక్స్ లో ఆండ్రియా ఫోటోలు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే.


తాజాగా ఆండ్రియాకు సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆండ్రియా ఓ స్టార్ హీరోతో ఈ ఫైర్ కొనసాగిస్తుందనే వార్త సోషల్ మీడియా మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా ఆ హీరోతో ప్రేమాయణం నడిపిస్తుందని... త్వరలోనే వివాహం చేసుకోవాలని అనుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆ హీరోతో కలిసి రిసార్ట్ కు కూడా వెళ్లినట్లు ఆండ్రియా సన్నిహితులు చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: