వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల కాబోయే కొన్ని సినిమాలకు సంబంధించిన విడుదల అప్డేట్లు ఇప్పటికే వచ్చాయి. అందులో భాగంగా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు . ఇకపోతే విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ కి ఇప్పటి వరకు మేకర్స్ టైటిల్ ఫిక్స్ చేయలేదు. కానీ సంక్రాంతికి వస్తున్నాము టైటిల్ ను ఈ మూవీ కి ఫిక్స్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను కూడా సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మరి సంక్రాంతి విడుదల కావడానికి ఫిక్స్ అయిపోయిన ఈ రెండు సినిమాల షూటింగ్లో ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

విశ్వంభర మూవీ యూనిట్ ప్రస్తుతం హైదరాబాదులో ఒక ప్రత్యేక సెట్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మల్లాడి వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

విక్టరీ వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాలో మీనాక్షి చౌదరి , ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఈ మూవీ బృందం ప్రస్తుతం పొల్లాచి పరిసర ప్రాంతాల్లో వెంకటేష్ మరియు ఐశ్వర్య రాజేష్ పై అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇలా సంక్రాంతి కి విడుదల కావడానికి రెడీగా ఉన్నా ఈ రెండు సినిమాల షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: