న్యాచురల్ స్టార్ నాని సెల్ఫ్ మేడ్ స్టార్ గా తనని తాను మలచుకున్న తీరు అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది. అష్టా చమ్మాతో హీరోగా పరిచయమైన నాని అంతకుముందు సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఐతే మోహనకృష్ణ ఇంద్రగంటి నానిని చూసి నువ్వు హీరో మెటీరియల్ అని అతన్ని పెట్టి అష్టా చమ్మా సినిమా చేశాడు. ఆ సినిమా సక్సెస్ అవ్వడం ఆ తర్వాత వరుస ఛాన్సులు రావడంతో నాని సినిమాలు చేస్తూ వచ్చాడు.

భీమిలీ కబడ్డి జట్టు, అలా మొదలైంది ఇలా వరుస సక్సెస్ లు అందుకుంటున్న నాని రాజమౌళి దృష్టిలో పడ్డాడు. అలా ఈగ ఛాన్స్ అందుకున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో ఎలాంటి ఇమేజ్ లేని హీరోగా చేయడం ఆ సినిమా హిట్ అవ్వడంతో నాని నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఐతే కెరీర్ మధ్యలో చాలా అప్ అండ్ డౌన్స్ చూసిన నాని మళ్లీ సెట్ రైట్ చేసుకుని సినిమాలు చేస్తున్నాడు.

కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ వారు చెప్పే కొత్త కథలకు ప్రాణం పోస్తున్నాడు నాని. న్యూ టాలెంట్ తో నాని చేస్తున్న సినిమాలు అటు కమర్షియల్ గా కూడా బాగా సక్సెస్ అవుతున్నాయి. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం సినిమా చేసిన నాని గురువార్మ్ ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని ఈగ 2 లో ఉండే ఛాన్స్ లేదని చెప్పాడు. రాజమౌళి స్వయంగా ఈగ సీక్వెల్ చేసినా నీకు ఛాన్స్ లేదని అన్నారట. ఆయన క్యారెక్టర్ ఎలాగు ఎండ్ అయ్యిందని చెప్పి ఉండొచ్చు కానీ నిజంగానే నాని ఇమేజ్ అప్పుడు ఈగంత కానీ ఇప్పుడు కాదు కదా ఒకవేళ రాజమౌళి చేయమన్నా సరే నాని చేసే ఛాన్స్ లేదని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: