కొన్ని సినిమాలకు బుక్ మై షో లో అద్భుతమైన రెస్పాన్స్ లభించిన సందర్భాలు ఉన్నాయి. అలా బుక్ మై షో లో ఒక కోటి కంటే ఎక్కువ టికెట్లు సేల్ అయినా మూడు ఇండియన్ సినిమాలు ఉన్నాయి. అవి ఏవో తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా బుక్ మై షో ఆప్ లో అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇకపోతే బుక్ మై షో లో ఒక కోటి కంటే ఎక్కువ టికెట్లు సేల్ అయిన సినిమాలు లిస్టు లో ఈ మూవీ కూడా ఉంది. ఇకపోతే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్ల గొట్టి బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది.

కల్కి 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన ఈ సినిమాకు 1000 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. అలాగే ఈ మూవీ కి సంబంధించిన ఒక కోటి కంటే ఎక్కువ టికెట్లు బుక్ మై షో యాప్ లో సేల్ అయ్యాయి. దిశా పటానిమూవీ లో హీరోయిన్ గా నటించగా ... నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. అమితా బచ్చన్ , దీపిక పడుకొనే కీలక పాత్రలలో నటించిన ఈ మూవీ లో విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ , శోభన , రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించారు.

జవాన్ : షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో ఒక కోటి కంటే ఎక్కువ టికెట్స్ సేల్ అయ్యాయి. ఈ సినిమా కూడా 1000 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా రాబట్టి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: