ప్రభాస్ తో సాహో మూవీలో ఆడిపడిన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రస్తుతం ఆమె నటించిన స్త్రీ 2 మూవీతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోయింది. అయితే అప్పటివరకు ఈ హీరోయిన్ కి ఎంతో కొంత గుర్తింపు అయితే బాలీవుడ్ లో ఉన్నప్పటికీ ప్రస్తుతం వచ్చిన స్త్రీ -2 మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఒక్కసారిగా అంచనాలు తారుమారయ్యాయి. అంతేకాదు సోషల్ మీడియా అయిన ఇంస్టాగ్రామ్ లో నరేంద్ర మోడీ,దీపిక పదుకొనే వంటి వారిని సైతం పక్కకు నెట్టి ఇంస్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోవర్లను సంపాదించింది.అయితే ఒకే ఒక్క మూవీతో ఓవర్ నైట్ లో ఈ ముద్దుగుమ్మ ఫేమస్ అయిపోయింది. అయితే ఎలాంటి ఈ ముద్దుగుమ్మ గురించి తాజాగా ఒక వార్త బీటౌన్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం ఫ్యామిలీకి దూరంగా వచ్చేసి ఓ స్టార్ హీరో ఇంట్లో రహస్యంగా ఉండబోతుంది అని తెలుస్తోంది. 

ఇక ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్.. మరి హృతిక్ రోషన్ ఇంట్లో శ్రద్ధా కపూర్ ఉండడమేంటి అని అందరూ అనుమానపడతారు..ఇక అసలు విషయం ఏంటంటే..శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ ముంబైలోని జూహులో ఒక లగ్జరీ ప్లాట్ ని గతంలోనే కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఫ్లాట్ ని అధునాతంగా తీర్చిదిద్దడం కోసం కొన్ని మరమ్మతులు చేస్తున్నారట శక్తి కపూర్. ఇక ఇది మరమ్మతులు చేస్తున్న సమయంలో ఇంట్లో ఉండరాదు కాబట్టి శ్రద్ధా కపూర్ అక్కడే ఉండే మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంటిని కొద్ది నెలలు అద్దెకి తీసుకోవాలని నిర్ణయం తీసుకుందట.

ఇక ఈ ఇంటికి సమీపంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఫ్లాట్ కూడా ఉందట.ఇప్పటికే హృతిక్ రోషన్ తో ఈ విషయం గురించి శ్రద్ధా కపూర్ మాట్లాడిందని, హృతిక్ రోషన్ కూడా శ్రద్ధాకి తన ఇంటిని అద్దెకి ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.అలాగే హృతిక్ రోషన్ ఇంట్లో ఉన్నందుకు నెలకు దాదాపు 10 నుండి 15లక్షల వరకు శ్రద్ధా కపూర్ అద్దె చెల్లిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే శ్రద్ధ కపూర్ హృతిక్ రోషన్ ఇంట్లో అద్దెకు దిగుతుందా అనేది తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: