తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల, తక్కువ సమయంలోనే ఎంతో మంది యువత హృదయాలను దోచుకున్నారు. ఆమె నటించిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. తన అందం, అభినయంతో పాటు, ఆమె డ్యాన్స్ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తుంది. హిట్, ప్లాఫ్ అంటూ  సంభందం లేకుండా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అంతేకాకుండా ఇతర భాషలపైనా కన్నేసింది. త్వరలో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ  మరో క్రేజీ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న

 శివకార్తికేయన్ 25వ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా కనిపించే అవకాసం ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి స్టార్ డైరక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహించనున్నారు. ఇంకా ఈ సినిమా కి సంబంధించిన టైటిల్ పెట్టని ఈ మూవీలో మరో స్టార్ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శివకార్తికేయన్‌కు జోడీగా శ్రీలీలను ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే వీళ్లిద్దరిపై ఫొటోషూట్‌ పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సూర్య హీరోగా నటించాల్సి ఉండగా ఆయన తప్పుకున్న నేపథ్యంలో శివకార్తికేయన్‌ని తీసుకున్నారని ప్రచారం

 జరుగుతోంది. సూర్యతో 'పురనానూరు' అనే టైటిల్‌తో తెరకెక్కించనున్నట్లు పేర్కొన్నారు. మరి శివ కార్తికేయన్‌తో అనుకుంటున్నది ఈ సినిమానే నా? కాదా అనే విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే శ్రీలీల తన కెరీర్‌లో ఇప్పటికే ఎంతో విజయం సాధించారు. తాజా సినిమా ఆమెకు మరింత ఎత్తుకు ఎదిగే అవకాశం ఇస్తుంది. ఈ సినిమా హిట్ అయితే ఆమె కెరీర్‌లో ఇది ఒక మైలురాయి అవుతుంది. అయితే ఈ సినిమా ఆమెను పాతుకుపోయేలా చేస్తుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా శ్రీలీల తన కెరీర్‌లో మరింత ఎదగాలని  అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: