టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్ మరియు విక్రమ్ మధ్య ఉన్న అభిమానం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విక్రమ్ తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురించి చేసిన కామెంట్లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా  విక్రమ్ తన ఇంటర్వ్యూలో ప్రభాస్  కల్కి సినిమాలోని పాత్రను చాలా ప్రత్యేకంగా అభివర్ణించారు. ప్రభాస్ ఇలాంటి పాత్రను చేయడం చాలా అరుదు అని. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయి అని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రభాస్ యొక్క నటనను చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయానని. ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్

 సూపర్ స్టార్ అని అతను ఇప్పుడు కేవలం ఒక్క తెలుగు స్టార్ మాత్రమే కాదు అంటూ కామెంట్స్ చేసాడు. విక్రమ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఉన్న అభిమానం ప్రేక్షకులను ఎంతగానో ఆనందపరుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది   పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. లాస్ట్ రెండు సినిమాలతో సుమారు 2000 కోట్ల వసూళ్లు అందుకున్న హీరోగా ప్రభాస్ రికార్డులు సెట్ చేసాడు. ఇక తాజాగా ఓటిటి ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చిన కల్కి 2898 ఎడి సినిమా రికార్డ్

 వ్యూస్ తో దూసుకు పోతుంది. ఇకపోతే నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు అంతా ఫిదా అవుతున్నారు. ఇక ఈ పాన్ ఇండియా సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇంగ్లిషేతర భాషల సినిమాల గ్లోబల్ ట్రెండింగ్స్ లో కల్కి 2898 ఏడీ రెండో స్థానంలో నిలిచింది. గత వారం మధ్యలో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చినా ఈ సినిమా 4 రోజుల్లోనే 45 లక్షల వ్యూస్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ పూర్తి వారం మరిన్ని రికార్డు వ్యూస్ సొంతం చేసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: