తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో తలపతి విజయ్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఆఖరుగా విజయ్ , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ , వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గొట్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ ని సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... త్రిష ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించే అవకాశాలు ఉన్నట్లు చాలా రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా యొక్క రన్ టైమ్ 2 గంటల 59 నిమిషాల వరకు ఉండబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

దానితోనే మరి ఇంత రన్ టైమా సినిమా స్టోరీ లో కాస్త దమ్ము లేకపోయినా సినిమాకి నెగిటివ్ టాక్ వస్తుంది అనే చాలా మంది భావించారు. ఇకపోతే తాజాగా మరొక వార్త బయటకు వస్తుంది. ఈ సినిమా యొక్క రన్ టైమ్ 2 గంటల 59 నిమిషాలు కాదు. 3 గంటల 03 నిమిషాలకు పై మాటే అని తెలుస్తుంది. దానితో మరి గోట్ సినిమా రన్ టైమ్ రోజు రోజుకు పెంచేస్తున్నారు. ఇంత రన్ టైమ్ తో సినిమా వర్కౌట్ అవుతుందా అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: