తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ల లో ఒకరిగా పేరు తెచ్చుకుంది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. ఈ ముద్దుగుమ్మ అటు సీనియర్ హీరోలను ఇటు కుర్ర హీరోలను ఇద్దర్ని లైన్ లో పెడుతోంది.. అంతే కాదు సీనియర్ హీరో అయిన నాగార్జునతో లిప్ లాక్ సీన్స్ లో నటించడంతో కుర్ర హీరోలతో నటించే అవకాశాలు మిస్ చేసుకుంది అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అయితే ఎంతో మంది యంగ్ హీరోలు రకుల్ ని సీనియర్ హీరోలతో నటించడం కారణంగానే పక్కన పెట్టేసారట.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సినీ సెలబ్రిటీల గురించి ఆశ్చర్యకర కామెంట్లు చేసింది. ఇందులో భాగంగా నటి రాశి కన్నా చాలా సైలెంట్ గా ఉంటుంది.. రాశి అంటే నాకు చాలా ఇష్టం. అలాగే నాకు అందరికంటే ఇష్టమైన వారిలో ప్రకాష్ కోవెలమూడి ఒకరు అని చెప్పింది .. ప్రకాష్ కోవెలమూడి అంటే స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు తనయుడు.. 

ప్రకాష్ తనకి చాలా సన్నిహితుడని,అలాగే తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ వస్తే ముందుగా ప్రకాష్ దగ్గరికి పంపించి అన్ని నేర్చుకోమని చెబుతానంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.అంతేకాదు నాని చాలా మంచోడు.. సైలెంట్ అలాగే డెడికేటెడ్ సిన్సియర్ అని,రవితేజ ని నేను రవి గారు అని పిలుస్తానని చెప్పింది.అంతే కాకుండా దగ్గుబాటి రానా ఒక మంచి హోస్ట్ అని ఆయనకు కాంప్లిమెంట్ ఇచ్చింది.ఇక మంచు లక్ష్మి తనకు తల్లి లాంటిదని, అన్ని విషయాల్లో తనని కేరింగ్ గా చూస్తుంది అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. ఇక రకుల్ మంచు లక్ష్మి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందనే సంగతి మనకు తెలిసిందే..

ఇలా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది సెలబ్రిటిలా గురించి రకుల్ చెబుతూ చివరిగా అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ గురించి చెబుతూ.. అఖిల్ నా డార్లింగ్..చాలా మంచోడు..అంటూనే అఖిల్ కి తన తమ్ముడు వయసు ఉంటుంది అని షాకింగ్ కామెంట్లు చేసింది.ఇక ఈమె కామెంట్స్ విన్న కొంతమంది అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున, నాగచైతన్యతో జతకట్టిన మీరు అఖిల్ తో కూడా సినిమాలో అవకాశం వస్తే చేస్తారు కావచ్చు అనుకున్నాం. కానీ సడన్గా అఖిల్ నాకు తమ్ముడు లాంటివాడని అన్నారేంటీ అని కొంతమంది కామెంట్స్ పెట్టారు.అయితే ఇవి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మాట్లాడిన వీడియో అయితే కాదు.గతంలో పెళ్లి కాకముందే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ప్రస్తుతం ఆ వీడియో మళ్లీ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: