పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2012 లో హరి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన గబ్బర్ సింగ్ సినిమా గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో తెలిసింది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మలుపు తిప్పి ఆయన్ని మళ్లీ స్టార్ హీరోగా నిలబెట్టింది. కాగా ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ కూడా ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంటారు. అభిమానుల గుండెల్లో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని

 ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే కానుకగా ఈ సినిమాను సెప్టెంబర్ 2న రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే బండ్ల గణేష్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం అని చెప్పాలి.  అంతే కాకుండా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఆయన అందించిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పటికీ కూడా ఈ పాటలు

 సోషల్ మీడియాలో లో వైరల్ అవుతునే ఉంటాయి. ఇక ఇందులో శృతి హాసన్ తన అందం, నటనతో అభిమానులను ఆకట్టుకుంది. ఇది కాసేపు పక్కన పెడితే సోషల్ మీడియాలో ఒక అభిమాని బండ్ల గణేష్ ను సంధ్య థియేటర్ కి గబ్బర్ సింగ్ చూసేందుకు రమ్మన్నారు. ఇక దానికి బండ్ల గణేష్ రెస్పాండ్ అయ్యారు. తన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి వస్తా అంటూ చెప్పుకొచ్చారు. కాగా వెళ్దాం పద అన్నా అంటూ హరీష్ శంకర్ సైతం స్పందించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. రీ రిలీజ్ తో ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: