మెగాస్టార్ చిరంజీవి గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే., ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పై మెగా ఫాన్స్ మెగా ఫ్యామిలీ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఏపీ ఎన్నికల సమయంలో మొదలైన ఈ వార్ ఇప్పటికీ అలానే కొనసాగుతూ ఉంది. వాస్తవానికి అల్లు అర్జున్ నంద్యాల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి వెళ్లడం, అతనికి మద్దతు ఇవ్వడంతోనే ఈ గొడవ మొదలైనట్లు అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే కొన్ని రోజులపాటు ఈ గొడవ కాస్త సద్దు మణిగింది. అయితే., ఇటీవల అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మళ్లీ ఈ గొడవలకు దారితీసింది. అనంతరం జనసేన ఎమ్మెల్యే ఎవరు అల్లు అర్జున్ దూషించి మాట్లాడడంతో.. ఈ వార్ కాస్త మళ్లీ పెద్దగా మారిపోయింది. 

అయితే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య గ్యాప్ అంత సోషల్ మీడియాలోనే కానీ లోపల వాళ్ళు మాత్రం చాలా బాగానే ఉన్నారు. ఈ క్రమంలో చిరంజీవి ఇంట్లో పూజ గదికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం  బయటకు వచ్చింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ ఇంట్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో మెగాస్టార్ తో పాటు భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన  తదితరులు ఇంట్లోని పూజ గదిలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతున్నాయి. 

అయితే ఈ ఫోటోలలో మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే.. చిరంజీవి ఇంట్లో ఉన్న పూజ మందిరంలో దేవుడి ఫోటోలతో పాటు చిరంజీవి తండ్రి అయిన వెంకట్రావు ఫోటో, అలాగే చిరంజీవి మామయ్య అయిన అల్లు రామలింగయ్య గారి ఫోటో కూడా ఉండడం. దేవుళ్ళతో పాటు వీరి ఇద్దరిని కూడా దేవుళ్ళుగా భావించి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు చిరంజీవి. ఇప్పటికైనా వీటిని చూసిన మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లుఅర్జున్ ఫ్యాన్స్ వార్ కు ముగింపు పలుకుతుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: