పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అలాగే తాను రిజెక్ట్ చేసిన ఒక మూవీ గురించి తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ , సూర్య దర్శకత్వంలో ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో భూమిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కు యూత్ లో అద్భుతమైన గుర్తింపు లభించింది.

ఇకపోతే తాజాగా నాని హీరో గా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా ఎస్ జే  సూర్య విలల్ పాత్రలో సరిపోదా శనివారం అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 29 వ తేదీన విడుదల కానుంది. దానితో ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ప్రియాంక మాట్లాడుతూ ... ఖుషి మూవీ ఒక క్లాసిక్ మూవీ. దానికి ఖచ్చితంగా పార్ట్ 2 తీయండి అని ఎస్ జె సూర్య ను అడిగింది. అలాగే అందులో పవన్ కళ్యాణ్ ను హీరోగా పెట్టండి అని అంది.

దానితో స్పందించిన ఎస్ కే సూర్య చాలా రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ కు "ఖుషి 2" మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ ను వినిపించాను. అది విన్న ఆయన బాగుంది అన్నారు. కాకపోతే ఇప్పుడు నేను లవ్ స్టోరీలు తీసే స్థాయిలో లేను. ఇప్పుడు తీసిన నాపై ఆ సినిమా వర్కౌట్ కాదు అన్నాడు. దానితో నేను ఒప్పించడానికి ప్రయత్నం చేశాను. కాకపోతే పవన్ కళ్యాణ్ వద్దు సూర్య వర్కౌట్ కాదు అని చెప్పాడు. దానితో నేను కూడా వదిలేసాను అని సూర్య తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: