తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నారు నటుడు రావు రమేష్.. ఈ నటుడు మరెవరో కాదు సీనియర్ నటుడుగా పెరు పొందిన రావు గోపాల్ రావు కుమారుడే ఈ రావు రమేష్.. తన తండ్రి నటనను సైతం రావు రమేష్ పుచ్చుకున్నట్టుగా నటిస్తూ ఉంటారు. అతి తక్కువ సమయంలోనే నటుడుగా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పరచుకున్నారు. ఎలాంటి పాత్రలోనైనా సరే తనని తాను ప్రూఫ్ చేసుకోగలిగిన ఏకైక నటుడుగా పేరు సంపాదించారు. ఈ మధ్యకాలంలో ఏరుకోరి మరి అవకాశాలను తీసుకుంటున్నారు.


ముఖ్యంగా తన కెరీర్ మీద ఫోకస్ చేసి తనకు పేరు వస్తుందని పాత్రలకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు రావు రమేష్.. అయితే రావు రమేష్ రెమ్యూనరేషన్ ఎంత అనే విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియకపోవచ్చు.. రావు రమేష్ తెలిపిన సమాచారం మేరకు రోజుకి రెమ్యూనరేషన్ రూ.4.7 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటారట.. అయితే ఇందులో తన రవాణా చార్జీలు కూడా కలిపి తీసుకుంటారని తెలుస్తోంది. ఇటీవలి రావు రమేష్  మెయిన్ పాత్రలో నటించిన తాజా చిత్రం మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం. ఈ సినిమా సక్సెస్ను అందుకుంది.


అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్మెంట్లో భాగంగా పలు రకాల యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన రెమ్యూనరేషన్ గురించి తెలియజేశారు రావు రమేష్. అయితే తాను తీసుకుని ప్రతి రూపాయి కూడ క్యాష్ రూపంలోని తీసుకుంటానని.. తాను తీసుకుంటున్న ప్రతి రూపాయికి కూడా టాక్స్ కడతానని తెలియజేశారు. అయితే అన్ని చిత్రాలకు ఒకేలా రేమ్యునరేషన్ ఉండదని కొన్ని పెద్ద ప్రాజెక్టులు చేసినప్పుడు కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటానని తెలిపారు. కొన్నిసార్లు తగ్గించుకొని కూడా నటించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు రావు రమేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: