గత కొన్ని నెలలుగా అల్లు కుటుంబం, మెగా కుటుంబం మధ్య వైర్యం ఉందో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు మధ్య మాత్రం ఒక యుద్ధం నడుస్తోందని చెప్పవచ్చు. అలా నెట్టింట రెండు కుటుంబాలకు సంబంధించిన మధ్య ఒక వార్ నడుస్తూనే ఉన్నది. దీంతో ఎవరు ఏం మాట్లాడినా కూడా క్షణాలలో వారి గురించి విరు వీరు గురించి వారు అన్నట్లుగా జోరుగానే చర్చించుకునేలా చేస్తున్నారు. ఇటీవలే జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ ని విమర్శించడంతో అల్లు ఫాన్స్ సైతం భారీగానే ఆయన మీద ఫైర్ అయ్యారు.



ఇలాంటి సమయంలోనే ఇప్పుడు నటి పూనమ్ కౌర్ లేటెస్ట్ ఫోటో ఒకటి హాట్ టాపిక్ గా టాలీవుడ్ లో మారింది. ఒకప్పుడు వరుసగా సినిమాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాలకు దూరమై నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. అందుకు కారణం ఇమే షేర్ చేసేటువంటి పోస్టులే అని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి తో కలిసి ఉన్న ఒక ఫోటోను సైతం ట్విట్టర్లో షేర్ చేసింది.. ఈ ఫోటోకు లవ్ ప్రేయర్స్ అండ్ హార్మోని అంటూ ఒక క్యాప్షన్ కూడా రాసుకుంది. అయితే ఇది ఒక స్పోర్ట్స్ ఈవెంట్లో ముగ్గురు కలిసి వెళ్లినప్పుడు దిగినట్టుగా ఈ ఫోటో కనిపిస్తోంది.


ప్రస్తుతం సడన్గా పూనమ్ కౌర్ ఇలాంటి పోస్ట్ పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.మెగా ,అల్లు కుటుంబాల మధ్య వార్ జరుగుతున్న సమయంలో ఇలాంటి షేర్ చేయడంతో ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నానని హింట్ ఇస్తోంది అనే విధంగా అభిమానులైతే కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది మాత్రం పూనమ్ ఇప్పుడు నీకు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అసలు పూనమ్ క ఇలా ఎందుకు పోస్ట్ పెట్టిందో క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: