ఇక షకీలా నటించిన సినిమాలకు భారీగా ఓపెనింగ్స్ వచ్చేవి. మలయాళంలో ఆమె నటించిన బి-గ్రేడ్ రొమాంటిక్ సినిమాల వల్ల చాలామంది నిర్మాతలు లాభాలు పొంది సెటిల్ అయిపోయారు. అలానే షకీలా కూడా మంచి రెమ్యూనరేషన్ అందుకుని తన ఫ్యామిలీని మంచి స్థాయిలో నిలబెట్టుకుంది. కానీ కొంత కాలానికి షకీలా ఆస్తులు లేకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు.
అయితే ఇటీవల షకీలకు లగ్జరీ ఫ్లాట్స్, బీఎండబ్ల్యూ కార్ ఉందని చాలామంది అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇదిలా ఉండగా... తాజాగా షకీలా సినీ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలాగే తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలోనూ నటీమణులపై అనేక రకాలుగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయని సంచలన కామెంట్స్ చేసింది.
ఇలాంటి వేధింపులు తెలుగు పరిశ్రమలో మరీ ఎక్కువగా ఉంటాయని చెప్పారు. అయితే కొందరు నటీమణులు మొదట్లో దీనికి ఒప్పుకోవడానికి కాస్త ఇబ్బందిపడిన ఆ తర్వాత అవకాశాల కోసం ఒప్పుకుంటారు. ఇక మంచి స్థాయి వచ్చిన తర్వాత అలాంటి పనులు చేయడానికి ఒప్పుకోకపోవడంతో సమస్యలు మొదలవుతాయని ఆమె వివరించారు. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే ఇలాంటి పనులు ప్రతి ఒక్కరూ చేస్తారని.... లేదంటే అసలు అవకాశాలే రావని షకీలా సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం షకీలా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.