వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీశ్ నిర్మిస్తున్న చిత్రం కానిస్టేబుల్.  వరుణ్ సందేశ్ కి జోడీగా మధులిక వారణాసి హీరోయిన్ గా తొలి హీరోయిన్ గా పరిచయం కానున్నారు. ఈ సినిమాకి సంబంధించి మోషన్ పోస్టర్ ని నిర్మాత కుమార్తె జాగృతి జన్మదినం సందర్భంగా గా బుధవారం సాయంత్రం డివో మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశారు.


 ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.  సినిమాపై మేం పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లు మోషన్ పోస్టర్ కూడా చాలా బాగా వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇందులో కానిస్టేబుల్ గా కొత్తకోణం కలిగిన పాత్రలో నటిస్తున్నాను. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందకు వస్తున్నాను. తప్పకుండా ఈ చిత్రం నా కెరీర్ ను మలుపు తిప్పుతుంది అని అన్నారు.


నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ.. కథ, కథనాలు అద్భుతంగా అమరిన చిత్రమిది. పోలీస్ పాత్రలో వరుణ్ చాలా బాగా ఆకట్టుకున్నారు అని పేర్కొన్నారు. దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్కే మాట్లాడుతూ.. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో వరుణ్ సందేశ్ నట విశ్వరూపం చూడవచ్చు. మోషన్ పోస్టర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉంటుంది అని తెలిపారు.



ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీశ్‌, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య, తదితరులు నటించారు.  ఈ చిత్రానికి కెమెరా హజరత్ షేక్ వలీ, సంగీతం సుభాష్ ఆనంద్, ఎడిటింగ్ వర ప్రసాద్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గ్యానీ, ఆర్ట్ వి.నాని, పండు, మాటలు శ్రీనివాస్, తేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిట్టపల్లి జగ్గయ్య, సహ నిర్మాత బి.నికిత, కుపేంద్ర పవర్, నిర్మాత బలగం జగదీశ్, కథ స్ర్కీన్ ప్లే దర్శకతం ఆర్యన్ సుభాన్ ఎస్కే.

మరింత సమాచారం తెలుసుకోండి: