నాచురల్ స్టార్ నాని ,డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం సరిపోదా శనివారం.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేశారు. విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి ఈ సినిమాతో నాని హిట్ అందుకున్నారా లేదా అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


సరిపోదా శనివారం సినిమాలో నాని ఎంట్రీ అదుర్స్ అనిపించేలా ఉందని రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా సరికొత్త కథఅంశంతో డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించారని.. శనివారం అనే కాన్సెప్ట్ తో అదిరిపోయేలా ఈ చిత్రం ఉందని నెటీజన్స్ అభిమానులు ట్విట్టర్ రూపంలో తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి జోక్స్ బిజామ్ ఇచ్చినటువంటి సంగీతం ఈ సినిమాని సక్సెస్ వైపుగా తీసుకువెళ్లిందని పలువురు నెటీజెన్స్ తెలుపుతున్నారు. హీరో నాని పాత్ర కూడా అద్భుతంగా ఉందని తెలుపుతున్నారు. అలాగే మిగిలిన నటీనటులు వారి పాత్రల ద్వారా నటించినప్పటికీ విలన్ గా ఎస్ జె సూర్య అద్భుతమైన నటన ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా హీరో నానిని డామినేట్ చేసేలా ఎస్ జె సూర్య పాత్ర ఉన్నదట.

డైరెక్టర్ వింటేజ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని .. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో గూస్ బంప్స్ తెప్పించేలా ఈ సినిమా ఉందని అభిమానులు తెలుపుతున్నారు. మొదటిసారి నాని సినిమాను విజిల్స్ మధ్య చూసినట్టుగా ఉందని ఫ్యాన్స్ తెలుపుతున్నారు. అలాగే ఇంటర్వెల్ బ్యాక్ గ్రౌండ్ కూడా అదిరిపోయేలా ఉందని తెలియజేస్తున్నారు. ఈ సినిమాకి టర్నింగ్ పాయింట్ కూడా ఇతని తెలుపుతున్నారు. హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా తన అందం అమాయకత్వంతో మళ్లీ ఆకట్టుకుందనే విధంగా తెలియజేస్తున్నారు.

కానీ చివరిలో క్లైమాక్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో హైప్ ఇవ్వలేకపోయిందని ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా ఆకట్టుకునేలా లేవని కొన్ని సన్నివేశాలు రిపీట్ గా అనిపించాయని.. కానీ సినిమా అయితే చూడవచ్చనీ తెలియజేస్తున్నారు.. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్ హీరో నాని, విలన్ సూర్య నటన అద్భుతంగా ఉందని.. ఈవారం ఒక ఆహ్లాదకరమైన సినిమా సరిపోదా శనివారం అంటూ తెలుపుతున్నారు. మొత్తానికి నాని ఫస్ట్ షో తోనే హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ పూర్తి రివ్యూ కోసం మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: