ఈరోజు విడుదల కాబోతున్న ‘సరిపోదా శనివారం’ మూవీ ఫలితం గురించి కేవలం ఈ మూవీ నిర్మాతలు మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రి వర్గాలు అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి. ప్రభాస్ ‘కల్కి’ మూవీ విడుదల తరువాత మళ్ళీ తెలుగు రాష్ట్రాలలోని ధియేటర్లు అన్నీ ప్రేక్షకులు లేక వెలవెల పోతున్నాయి.



ఇలాంటి పరిస్థితులలో ఈరోజు విడుదల అవుతున్న ‘సరిపోదా శనివారం’ ఫలితం టాలీవుడ్ ఇండస్ట్రీ మనుగడకు అత్యంత కీలకంగా మారింది. ఈనెల 15న విడుదలైన ‘మిష్టర్ బచన్’ ‘డబల్ ఇస్మార్ట్’ సినిమాలు రెండు ఘోరమైన ఫ్లాప్ లుగా మారడంతో ఈరెండు సినిమాలను కొనుక్కున్న బయ్యర్లకు భారీగా నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం నాని ఇమేజ్ బాగా ఉండటంతో ‘సరిపోదా శనివారం’ మూవీకి భారీ స్థాయిలో మార్కెట్ జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.



ఈమూవీ టైటిల్ డిఫరెంట్ గా ఉండటంతో పాటు నాని ఇమేజ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ డిఫరెంట్ టేకింగ్ ఈమూవీని మరో స్థాయికి తీసుకు వెళుతుందని అంచనాలు ఉన్నాయి. ఈసినిమాకు ఎటువంటి పోటీ లేకపోవడంతో పాటు ఈమూవీని పాన్ ఇండియా స్థాయిలో దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్న నేపధ్యంలో చాల సులువుగా ఈమూవీకి అత్యంత భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా.



ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి వర్షాలు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకపోవడంతో పాటు సినిమాలను అభిమానించే యూత్ కు సరైన ఎంటర్ టైన్మెంట్ కూడ లేకపోవడంతో ఈమూవీకి పాజిటివ్ టాక్ వస్తేచాలు చాల సులువుగా ఈమూవీ 100 కోట్ల క్లబ్ లో చేరిపోతుంది. అయితే ఈమూవీ అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లకు స్పందన అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఈమూవీ టాక్ ను బట్టి కలక్షన్స్ ఉంటాయి అన్న అంచనాలు వస్తున్నాయి. ఈమూవీ తరువాత మరో నెలరోజులవరకు సరైన సినిమాగా ‘దేవర’ ఒక్కటే కనిపిస్తోంది. దీనితో సినిమాలు చూడాలి అని భావించే వారికి ఈమూవీ మంచి ఆపక్షన్ గా మారే ఆస్కారం ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: