ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో అనేక సినిమాలో రీ రిలీస్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే రీ రిలీస్ అవుతున్న సినిమాలలో కొన్ని సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి సినిమాను రీ రిలీజ్ చేయగా ఆ సినిమా అప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఏ మూవీ రీ రిలీజ్ లో భాగంగా కలెక్ట్ చేయని కనెక్షన్లను వసూలు చేసి కొత్త రికార్డులను సృష్టించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22 వ తేదీన ఇంద్ర మూవీ ని రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా అనేక కొత్త రికార్డులను సృష్టించింది.

ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఉన్న విషయం మనకు తెలిసిందే. దానితో ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ లలో ఒకటి అయినటువంటి గబ్బర్ సింగ్ మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే విడుదల అయ్యింది. ఈ మూవీ కి సంబంధించిన అడ్వాన్స్ టికెట్ సేల్స్ కూడా మొదలు అయ్యాయి.

ఇక గబ్బర్ సింగ్ మూవీ ఇప్పటికే అదిరిపోయే రేంజ్ దూకుడును చూపిస్తుంది. ఈ మూవీ కి సంబంధించిన టిక్కెట్ సేల్స్ మొదలు అయిన రెండు గంటల్లోనే ఏకంగా 20 వేలకు పైగా టికెట్లు సేల్ అయ్యాయి. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఏలాంటి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: