ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ సెకండ్ జనరేషన్ టాప్ హీరోలలో ఒకడిగా నిలిచాడు. తెలుగు పరిశ్రమకి నాలుగురు హీరోలు పిల్లర్లు అయితే వారిలో ఒకరు బాలకృష్ణ. ఈ హీరో 50 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా రాణిస్తున్నాడు. 60 ఏళ్ల వయసులోనూ హ్యాట్రిక్ హిట్స్ సాధించి తన పవర్ ఏంటో చూపించారు. రాజకీయాల్లో కూడా హ్యాట్రిక్ సక్సెస్ సాధించారు. అంతేకాదు, బాలయ్య బాబు అద్భుతమైన హోస్టింగ్ స్కిల్స్ తో బుల్లితెర కింగ్ అయ్యాడు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో ప్రసారమవుతున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షోలో బాలయ్య తండ్రిపై తనకు ఉన్న ప్రేమను, గౌరవాన్ని ఎప్పటికప్పుడు బయట పెడుతుంటారు. అందువల్ల ప్రజలకు బాలయ్యపై మరింత ప్రేమ పెరిగిపోయింది.

తాజాగా బాలకృష్ణ ఈ షోలో తన రీసెంట్ మూవీ "భగవంత్ కేసరీ" గురించి దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి చాలా ఆసక్తికరమైన విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ముచ్చటలో భాగంగా "నన్ను గురువు గారు అని ఎందుకు పిలుస్తున్నారు?" అని బాలకృష్ణను అనిల్‌ ప్రశ్నించారు. అంతేకాదు, వయస్సులో చిన్నవాడిని, జస్ట్ ఏడు సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేశాను. ఏ విధంగా చూసుకున్నా మీ కంటే నేను జూనియర్. అయినా సెట్స్‌లో మీరు నన్ను గురువు గారు అని ఎందుకు పిలిచారు? ఆ పిలుపు నాకు ఎంతో హ్యాపీనెస్ అందించింది. మీరిచ్చిన గౌరవానికి నేను ఫిదా అయ్యా" అని అనిల్ సందేహాన్ని వ్యక్తం చేస్తూ అడిగారు.

ఆ ప్రశ్నకు బాలకృష్ణ పూర్తిస్థాయిలో ఒక క్లారిటీ ఇచ్చారు. బాలయ్య మాట్లాడుతూ "నా పాత్రకు ప్రాణం పోసే దర్శకులు ఎవరైనా సరే నాకు తండ్రితో సమానం. ప్రతీ డైరక్టర్ ను తండ్రితో ఈక్వల్‌గా ట్రీట్ చేస్తా. అందుకే అలా పిలుస్తా" అని వెల్లడించారు. తండ్రికి ఇచ్చే గౌరవం, దర్శకులకు కూడా బాలకృష్ణ ఇస్తున్నారు అని తెలిసి చాలామంది ఫిదా అవుతున్నారు. తన తండ్రిని ఒక ట్రేడ్ మార్క్ లాగా బాలకృష్ణ చూడటం అద్భుతమైన లక్షణం అని పేర్కొంటున్నారు. బాలకృష్ణ మంచి గుణానికి ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: