టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి బాలయ్య , నాగార్జున , వెంకటేష్ కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు ఒకే రకం టైటిల్ లతో ఉన్న సినిమాల్లో హీరోలుగా నటించారు. ఆ సినిమాలు ఏవి ..? అవి ఎలాంటి సక్సెస్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయో తెలుసుకుందాం.

బాలకృష్ణ 1993 వ సంవత్సరంలో బంగారు బుల్లోడు అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ను అందుకుంది. ఈ మూవీ లో రమ్యకృష్ణ , రవినా తండన్ హీరోయిన్లుగా నటించారు. రవినా తండన్ ఈ మూవీ తోనే తెలుగు తేరకు పరిచయం అయింది. రవి రాజా పినిశెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కొన్ని సంవత్సరాల క్రితం ఘరానా బుల్లోడు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాకు రాఘవేందర్రావు దర్శకత్వం వహించగా ... రమ్యకృష్ణమూవీ లో హీరోయిన్గా నటించింది. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

1996 వ సంవత్సరం రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో వెంకటేష్ సరదా బుల్లోడు అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాలను విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు.

ఇలా బాలకృష్ణ బంగారు బుల్లోడు , నాగార్జున ఘరానా బుల్లోడు , వెంకటేష్ సరదా బుల్లోడు అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఇందులో బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు , నాగార్జున నటించిన ఘరానా బుల్లోడు సినిమాలు మంచి విజయాలను అందుకోగా ... వెంకటేష్ నటించిన సరదా బుల్లోడు సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: