తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన సినిమాల ద్వారా మాత్రమే కాకుండా కొన్ని బిజినెస్ ద్వారా కూడా పెద్ద మొత్తంలోనే డబ్బులను కూడా పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈయనకు హైదరాబాద్ నగరం లోని హైటెక్ సిటీ కావేరి హిల్స్ లో షో యు టేస్ట్ ఫుల్ ఏసియన్ డెలివర్డ్ అనే పేరుతో ఒక రెస్టారెంట్ ఉంది. హైదరాబాదు లోనే ఈ రెస్టారెంట్ మోస్ట్ పాపులర్ టాప్ 10 రెస్టారెంట్ లలో ఒకటిగా నిలిచినట్లు తెలుస్తోంది.

ఇక్కడ అనేక రకాలైన కొత్త వంటకాలు ఉంటాయి అని వాటిని టెస్ట్ చేయడానికి ఎంతో మంది రోజు వస్తూ ఉంటారు అని తెలుస్తుంది. దాని ద్వారా ఈ రెస్టారెంట్ కి కోట్లలో లాభం వస్తున్నట్లు సమాచారం. ఇకపోతే రోజుకు ఈ రెస్టారెంట్ కు 2 నుండి 3 లక్షల వరకు లాభాలు వస్తున్నట్లు వీకెండ్స్ లో ఈ లాభాలు మరింతగా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇలా చూసినట్లు అయితే దాదాపు నెలకు ఈ రెస్టారెంట్ ద్వారా నాగ చైతన్య కు 60 లక్షల రూపాయల వరకు లాభాలు వస్తున్నట్లు , సంవత్సరానికి 8 నుండి 10 కోట్ల వరకు నాగ చైతన్య కు ఈ రెస్టారెంట్ ద్వారానే డబ్బులు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా సినిమాల ద్వారా మాత్రమే కాకుండా నాగ చైతన్య రెస్టారెంట్ బిజినెస్ ద్వారా కూడా అద్భుతమైన స్థాయిలో లాభాలను అందిపుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం నాగ చైతన్య , చందు మండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc