ఈ మధ్య కాలంలో వరుస పెట్టి తెలుగు సినిమాలు రీ రిలీస్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంతకాలం క్రితమే మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 వ తేదీన మురారి సినిమాను అత్యంత భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. ఇక ఆగస్టు 22 వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఇంద్ర మూవీ ని రీ రిలీజ్ చేశారు. అలాగే నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా మాస్ మూవీ ని రీ రిలీజ్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గబ్బర్ సింగ్ మూవీ ని రీ రిలీజ్ చేయబోతున్నారు. రీ రిలీజ్ అయిన సినిమాలకి కలెక్షన్లు బాగానే వస్తున్నాయి.

కానీ ఈ సినిమాల సమయంలో విడుదల అయిన కొత్త సినిమాలపై రీ రిలీజ్ ల ఏఫెక్ట్ భారీగా పడుతుంది. కొన్ని రీ రిలీజ్ సినిమాల ద్వారా కొత్త సినల కలెక్షన్లు తగ్గుతున్నాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితం బన్నీ వాసు నిర్మించిన ఆయ్ అనే సినిమా థియేటర్లలో విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో నడుస్తున్న సమయంలోనే చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర మూవీ రీ రిలీజ్ అయింది.

దానితో తాజాగా బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆయనకు ఇంద్ర సినిమా రీ రిలీస్ ద్వారా ఆయ్ మూవీ కలెక్షన్ల పై ఏమైనా ఎఫెక్ట్ పడిందా ... మీరేమైనా నష్టపోయారా అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది. దీనితో ఆయన స్పందిస్తూ ... చిరంజీవి గారి సినిమా రీ రిలీస్ వల్ల నాకు ఎలాంటి నష్టం జరగలేదు. ఒక రోజు దేవి థియేటర్లో ఒక షో అడిగారు ఇచ్చేసాను. ఆయన సినిమా కోసం లాభనష్టాలు ఆలోచించే స్థాయికి నేను ఎదగలేదు. అలాంటి ఆలోచన కూడా నాకు రాలేదు అని ఆయన సమాధానం ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bv