టాలీవుడ్ కుర్ర హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. ఈ మధ్యనే ఆయన బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పి మ్యారేజ్ లైఫ్‌లోకి అడుగు పెట్టాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూనే తన తొలి చిత్రాన్ని హీరోయిన్ రహస్య గోరఖ్ చేశారు. ఇప్పుడు ఆమెతోనే ఏడడుగులు వేశారు. రాజావారు రాణిగారు మూవీలో సందడి చేసిన ఈ జంట నిజజీవితంలో ఒక్కటవుతారని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఆ మూవీలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారట. అప్పటి నుంచి ఒకరంటే మరొకరు ఇష్టపడుతున్నా బయటకు మాత్రం ఆ విషయాన్ని రివీల్ చేయలేదు. ఐదు సంవత్సరాల పాటు వీరి ప్రేమ సీక్రెట్ గానే సాగింది.

నిశ్చితార్థం అయిన తర్వాతే తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు కిరణ్ అబ్బవరం. ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి మరీ మ్యారేజ్ చేసుకున్నారు. ఆగస్టు 22వ తేదీన కర్ణాటకలోని కూర్గ్‌లో కిరణ్, రహస్యల పెళ్లి జరిగింది. కర్ణాటకలోని ఓ రిసార్ట్‌లో జరిగిన వీరి పెళ్లికి కొద్ది మంది సినిమా సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి తర్వాత కిరణ్, రహస్యలు ఒక్కటైనట్లుగా సోషల్ మీడియాలో చాలా ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలు కాస్తా నెట్టింగ తెగ వైరల్ అయ్యాయి.


తాజాగా కిరణ్, రహస్యల జంట ప్రీ వెడ్డింగ్ ఫోటోలను షేర్ చేశారు. రీసెంట్‌గా ప్రీవెడ్డింగ్‌కు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు మాత్రమే కాకుండా ఈ జంట తమ హల్దీ, మెహందీ, సంగీత్ ఫోటోలను కూడా షేర్ చేసేసింది. ఇక రహస్య అయితే తన లైఫ్‌లో అవి ఎంతో బెస్ట్ మూమెంట్స్ అంటూ నోట్ రాసుకొచ్చింది. తమకు శుభాకాంక్షలు చెప్పిన వారికి ప్రత్యేకంగా థ్యాంక్యూ చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం రహస్య పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలకు నెటిజన్లు కూడా కొత్త జంటకు విషెష్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో వారిద్దరూ కలిసి సినిమా కూడా చేయాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: