తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా యందు హీరోలలో పేరు పొందిన వారిలో అడవి శేషు కూడా ఒకరు.. ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలు చాలెంజింగ్ ఉండే సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించగలిగారు. స్పై ఏజెంట్ పాత్రలలో  ఎక్కువగా బాగా ఆకట్టుకుంటూ ఉంటారు అడవి శేషు. అడవి శేషు కెరియర్ లో ఒక మైలు రాయిగా మిగిలిపోయిన చిత్రం గూడచారి.. ఈ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న అడవి శేషు. ఆ తర్వాత తన కెరీర్ పరంగా వెనక్కి చూసుకోలేదు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా సీక్వెల్ ని G-2 గా తెరకెక్కిస్తున్నారు.


అడవి శేషు, వనిత సందు జంటగా డైరెక్టర్ వినయ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో G-2 రూపొందిస్తున్నారు.. గూడచారి సినిమా మొత్తం ఇండియాలో షూటింగ్ జరపగా G-2 సినిమా మాత్రం గూడచారి సినిమాకి ఏమాత్రం తగ్గకుండా యాక్షన్ సన్నివేశాలను ఫ్రాన్స్ స్విజర్లాండ్, ఇటలీ ఇతర దేశాలలో షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో G2 సినిమా బడ్జెట్ దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు చేరినట్లుగా తెలుస్తోంది.


అది కుర్ర హీరో మీద ఇన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హస్మి ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక అగర్వాల్ నిర్మిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. మరి ఎన్ని కోట్ల రూపాయలు అడవి శేషు రాబట్టగలరా అనే సందేహం కూడా అందరిలో కలుగుతోంది. అయితే అభిమానులైతే మాత్రం సినిమా స్టోరీ పరంగా బాగుంటే ఇదేమి పెద్ద సమస్య కాదని ప్రేక్షకులు కూడా స్టోరీ బాగుంటే ఎన్నో చిత్రాలకు కోట్ల రూపాయలు రాబట్టిన సందర్భాలు ఉన్నాయని తెలుపుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: