సినీ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఉన్న క్రేజే వేరు. అప్పట్లో కమెడియన్‌గా అల్లు రామలింగయ్య ఇండస్ట్రీని ఏలాడు. ఆ సమయంలోనే గీతా ఆర్ట్స్ పేరుతో సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఆ వ్యవహారాలన్నీ కూడా అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్ చూసుకునేవాడు. నిర్మాతగా మారిన అల్లు అరవింద్ తన బ్యానర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఇప్పుడైతే గీతా ఆర్ట్స్ నుంచి రెండవ బ్యానర్‌ను ప్రారంభించి మూవీస్ చేస్తున్నారు. దాని బాధ్యతలను నిర్మాత బన్నీ వాసుకు అప్పగించాడు.

కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో అల్లు స్టూడియోస్‌ను అల్లు ఫ్యామిలీ ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా 2022లో మెగాస్టార్ చిరంజీవి కూడా లేటెస్ట్ వెర్షన్ అల్లు స్టూడియోకు రిబ్బన్ కటింగ్ చేశారు. ఆ సమయంలో తమ స్టూడియోలు షూటింగులతో పాటుగా పోస్ట ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతాయని అల్లు ఫ్యామిలీ అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు ఆ స్టూడియో ప్లాన్‌ను మార్చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు మేకర్స్ అంతా హైదరాబాద్ శివార్లలో ల్యాండును లీజ్‌కు తీసుకుని సెట్లు వేసి మరీ షూటింగ్స్ చేసుకుంటున్నారు. ప్రైవేట్ స్టూడియో ల్యాండ్స్ కాన్సెప్ట్ ఇప్పుడు బాగా పాపులర్ అయ్యిందని చెప్పాలి. నిర్మాతలంతా  దానిపైనే మొగ్గుచూపుతున్నారు. స్టూడియోలకంటే బయట సెట్ వేసి షూట్ చేస్తే ఖర్చు తగ్గుతుందని అనుకుంటున్నారు. ఇదే టైంలో అల్లు స్టూడియో ఉన్న కోకాపేట పెద్ద రియల్ ఎస్టేట్ ఏరియాగా మారిపోయింది. అక్కడ ఇండ్లు, ల్యాండ్ రేట్లు భారీగా పెరగడంతో ఆ ఏరియా ఫుల్ బిజీ అయ్యింది. దీంతో అల్లు అరవింద్ ఓ నిర్ణయం తీసుకున్నారట. ఫిల్మ్ స్టూడియో కంటే మల్టీప్లెక్స్ బెటర్ అని అనుకుంటున్నారట. ఫిల్మ్ స్టూడియో ఓ ఫ్లోర్‌లో ఉంటే మిగతాది అంతా మల్టీపెక్స్ కోసం వాడుదామని ఫిక్స్ అయ్యారట. దీంతో ఇటు స్టూడియోతో పాటు అటు మల్టీప్లెక్స్‌గా కూడా అల్లు స్టూడియోస్‌ను ఛేంజ్ చేస్తున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: