సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ అని ఎవరినైనా అడిగితే టక్కున అందరూ నయనతార అంటారు. కానీ 1970లలోనే ఓ లేడీ సూపర్ స్టార్ ఉన్నారు. ఆమే నటి శ్రీవిద్య. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆమె 800 చిత్రాలకు పైగా నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ఈమె నటనతో పాటుగా కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారు. అలాగే భరతనాట్యంలో ప్రావీణ్యం పొందారు. కమల్ హాసన్ తొలి లవర్ కూడా శ్రీవిద్యేనని ఇండస్ట్రీ మొత్తం తెలుసు. అలాంటి ఆమె క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రాణాలు వదిలారు.

శ్రీవిద్య తండ్రి కృష్ణమూర్తి ఓ కమెడియన్. తల్లి వసంతకుమారి కర్ణాటక సింగర్. వీరికి 1953 జూలై 23న శ్రీవిద్య జన్మించారు. ఆమె పుట్టిన కొన్ని రోజులకే తండ్రి వ్యాధిన బారిన పడ్డారు. దీంతో కుటుంబం కోసం శ్రీవిద్య తల్లి పనిచేయాల్సి వచ్చింది. తల్లికి భారాన్ని తగ్గించే క్రమంలో శ్రీవిద్య మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 1967లో ఆమె బాలనటిగా తన కెరీర్‌ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెకు 1971లో తొలి విజయం దక్కింది. బాలచందర్ డైరెక్షన్‌లో శ్రీవిద్య నూట్రోక్కరునూరు మూవీలో నటించారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత అపూర్వ రాగాలు సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ అయ్యారు.

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జంటగా తొలిసారి నటించింది కూడా శ్రీవిద్యనే. అపూర్వ రాగాలు చిత్రంలో రజనీకి ఆమె జోడీగా చేశారు. ఆ మూవీలో నటిస్తున్నప్పుడు కమల్ హాసన్‌పై ప్రేమను పెంచుకున్నారు. కానీ శ్రీవిద్య తల్లి అందుకు అంగీకరించలేదు. దీంతో కమల్‌తో బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది. శ్రీవిద్యతో విడిపోయాక నటి వాణి గణపతిని కమల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకు  భరతన్, జార్జ్ థామస్ అనే ఇద్దరిని శ్రీవిద్య పెళ్లి చేసుకున్నా వారి బంధం నిలవలేదు. వారికి విడాకులు ఇచ్చాక కూడా కమల్ పై శ్రీవిద్య ప్రేమ చావలేదు. 2003 నుంచి ఆమె క్యాన్సర్‌తో పోరాడుతూ ఆఖరికి 2006లో మరణించారు. ఆమె చనిపోయే ముందు చివరి కోరికగా కమల్ హాసన్ వెళ్లి పరామర్శించారు. అప్పట్లో వారి ప్రేమ ఇండస్ట్రలో హైలెట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: