ఏఐ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ వాడుకలోకి వచ్చాక కొన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. చాలా రంగాల్లో ఉద్యోగాల కోత కూడా జరిగింది. అటువంటి ఏఐ టెక్నాలజీతో సినిమాకు సంబంధించి మ్యూజిక్ కేటగిరీలో కూడా ఎఫెక్ట్ పడనుంది. మ్యూజిక్ డైరెక్టర్లకు ఏఐ తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ విషయంపైనే సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ సాగుతోంది. సినిమాకు మ్యూజిక్ అందించాలంటే మ్యూజిక్ డైరెక్టర్ ముందుగా సినిమా స్టోరీ వినాలి. ఆ తర్వాత ట్యూన్స్ సెట్ చేసుకోవాలి.

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో డైరెక్టర్, నిర్మాతతో సిట్టింగ్ వేశాక ఫైనలైజ్ చేసుకోవాలి. ఇదంతా జరిగేందుకు కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా పడుతుంది. పాటలు, ఆర్ఆర్, ట్రైలర్లు, గ్లింప్స్, ప్రమోషన్ వీడియోలు..ఇలా చాలానే కష్టపడాల్సి ఉంటుంది. ఇందుకోసం మ్యూజిక్ డైరెక్టర్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. చాలా మంది ఇందులో పనిచేస్తారు కూడా. స్టూడియో బాయ్ నుంచి సౌండ్ ఇంజినీర్స్ వరకూ చాలా మందిని మెయింటెయిన్ చేస్తూ వర్క్‌ను ఫినిష్ చేస్తాడు మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఇకపై ఆ వర్కులకు ఏఐ వాడే అవకాశం ఉంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మ్యూజిక్ వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కొన్ని రకాల ఏఐ మ్యూజిక్‌ యాప్స్‌ అందుబాటులోకి వచ్చేశాయి. అవి ఉంటే చాలు మ్యూజిక్ డైరెక్టర్ అవసరమే ఉండదు. వాటి ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా లిరిక్స్ ఇస్తే చాలు క్షణాల్లోనే అవి పాటలను సిద్ధం చేసేస్తాయి. ట్యూన్ కట్టి సింగర్ వాయిస్, మ్యూజిక్‌తో సహా అన్ని ఇచ్చేస్తాయి. మనకు ఎటువంటి ట్యూన్ కావాలంటే అది, ఏ వాయిస్ కావాలంటే ఆ వాయిస్ రిఫరెన్స్ ఇస్తే చాలు. ఇక అన్నీ ఫటాఫట్ రెడీ అయిపోతాయి. ఎస్పీ బాలు వాయిస్‌తో పాట కావాలని ఇస్తే చాలు.. క్షణాల్లో ఆయన గొంతుతో పాట రెడీ అయిపోతుందన్నమాట. అది కూడా వందల ట్యూన్స్‌తో మనకు అందిస్తాయి. ఈమధ్యనే రామ్ గోపాల్ వర్మ కూడా అలాంటి మ్యూజిక్ యాప్‌ను వినియోగించి పాటల్ని వినిపించారు. అయితే ఈ ఏఐ యాప్స్ వాడుకలోకి వస్తే మాత్రం సినీ రంగంలో మ్యూజిక్ కేటగిరిపై పెద్ద ఎఫెక్టే పడనుందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: