సెప్టెంబర్ చివర్లో ఎన్టీఆర్ దేవర రానుంది. ఆ తర్వాత చిన్న బడ్జెట్ సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక నవంబర్ నెలలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. డిసెంబర్ నెలకు వచ్చేసరికి అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాలు రానున్నాయి. ఇవి రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. తెలుగు ఇండస్ట్రీకి ఈ ఏడాదికి ఇవే దిక్కు. సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరుకారం అంటూ వచ్చినా ఫలితం లేదు. ఆ తర్వాత ప్రభాస్ కల్కి అంటూ వచ్చాడు. అయితే అంతగా ప్రభావం కనిపించలేదు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్, అల్లుఅర్జున్ కౌంట్‌డౌన్ మొదలైంది. నెల రోజుల్లో దేవర వస్తుంటే వంద రోజుల్లో పుష్ప2 రానుంది. క్రిస్మస్‌కి చరణ్ గేమ్ ఛేంజర్ సందడి చేయనుంది. వీటితోనైనా సినీ ప్రేక్షకుల ఆకలి తీరుతుందేమోననేది చూడాల్సిందే మరి.
ఎన్టీఆర్ దేవర, అల్లు అర్జున్ పుష్ప2, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’.. ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా లెవల్లో ఉన్నవే. దీంతో తెలుగులోనే కాకుండా ఈ మూవీస్ కోసం వేరే ఇండస్ట్రీవాళ్లు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారని చెప్పాలి. అలాగే కన్నప్ప, లక్కీభాస్కర్ సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతాయని అంటున్నారు. వీటితో పాటు సూర్య కంగువా, రజనీ వేట్టయాన్, విజయ్ గోట్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి వీటి మధ్య పోటీ ఎలా ఉంటుంది? ఏవి సక్సెస్ సాధిస్తాయి? అనేది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.