సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలు వస్తున్నాయి అంటే చాలు ఆ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల గాసిప్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఆయా స్టార్ హీరోల సినిమాలలో మరికొంతమంది స్టార్లు నటించబోతున్నారంటూ వార్తలు తెరమీదకి వస్తూ ఉంటాయి. అయితే కొంతకాలం నుంచి ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ సీక్వెల్ విషయంలో కూడా ఇలాంటి వార్తలు వస్తున్నాయి.


 నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు 1100 కోట్లకు పైగా వసూలు సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది ఈ మూవీ. మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ అనే కాన్సెప్ట్ నీ జోడించి నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు అని వర్గాల ప్రేక్షకులను మంత్రముగ్ధులని  చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.  అయితే ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.


 కాగా కల్కి మొదటి పార్ట్ లో దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్లు అందరూ కూడా కనిపించారు అని చెప్పాలి. అయితే కల్కి రెండవ పార్క్ లో కూడా నాగ్ అశ్విన్ ఇలాంటి ట్విస్టులు ప్లాన్ చేసి ఉంటాడని.. వార్తలు వస్తున్న ఈ క్రమం లోనే న్యాచురల్ స్టార్ నాని ప్రభాస్ కల్కి 2 మూవీలో కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల నాని సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించగా ఇదే విషయంపై ప్రశ్న ఎదురయింది. మీరు కల్కి 2 లో నటిస్తున్నారా అని ప్రశ్నించగా.. తాను నటించడం లేదు అంటూ చెప్పుకొచ్చారు నాని. దీంతో కల్కి సీక్వెల్లో నేచురల్ స్టార్ కనిపిస్తాడని ఆశపడిన అతని అభిమానులకు నిరాశే ఎదురయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: