ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ సెలబ్రిటీలకు ప్రేక్షకులకు మధ్య దూరం పూర్తిగా తగ్గిపోయింది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు అభిమాన హీరో హీరోయిన్లను చూడాలి అంటే ఎక్కడో షూటింగ్ జరుగుతున్న చోటుకు వెళ్లి గంటల తరబడి నిలబడి దూరం నుంచి చూసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా అభిమాన సెలబ్రిటీలతో ఎంతోమంది ప్రేక్షకులు నేరుగా మాట్లాడగలుగుతున్నారు. హీరో హీరోయిన్లు సైతం ఇక సోషల్ మీడియాలో చిట్ చాట్ సెషన్ నిర్వహించి అభిమానులతో ముచ్చటించడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఫ్యాన్స్ సెలబ్రెటీలను తాము అడగాలనుకున్న ప్రశ్నలన్ని అడిగేస్తూ ఉంటే.. సెలబ్రెటీలు కూడా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉన్నారు. అయితే నాచురల్ స్టార్ నాని కూడా ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో అస్క్ నాని పేరుతో చిట్ చాట్ సెషన్ నిర్వహించాడు. ప్రస్తుతం నాని సరిపోద శనివారం అనే మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది అని చెప్పాలి. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం నాని సోషల్ మీడియా వేదికగా ఆస్క్ నాని పేరుతో అభిమానులతో ముచ్చటించారు.



 అయితే ఈ చిట్ చాట్ చేసేందుకు కేవలం అభిమానులు మాత్రమే కాదు ప్రస్తుతం తాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టాలెంటెడ్ హీరోగా కొనసాగుతున్న తేజ సజ్జ నానితో సంభాషించాడు. ఆల్ ది బెస్ట్ నాని గారు అని తేజ సజ్జ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఈ పోస్ట్ తర్వాత నాని తేజ సజ్జ కు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. గారు ఏంటి గారు అన్నా అని పిలువ్ అంటూ తేజ సజ్జకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు నాని. ఒక రకంగా నువ్వు నా తమ్ముడివి గారు అని దూరం పెట్టకు అని చెప్పకనే చెప్పాడు నాని. దీంతో నాని రిప్లై చూసి అభిమానులకు మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: