తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది కమెడియన్స్ ఉండగా కొంతమంది మాత్రమే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారు ఉన్నారు. ఇక తమ హావ భావాలతో ప్రేక్షకులను కడుపుకబ్బా నవ్విస్తూ వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు. అలాంటి వారిలో యంగ్ కమెడియన్ సత్య కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా మొదలైన కమెడియన్ సత్య ప్రయాణం.  సినిమా ఇండస్ట్రీ వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుసగా సినిమాల్లో చాన్సులు  దక్కించుకుంటూ.. తనదైన శైలి నటనతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నాడు.


 ఒకప్పుడు అంటే ఇండస్ట్రీలో చాలామంది కమెడియన్స్ ఉండేవారు. దీంతో డైరెక్టర్లకు కూడా ఎక్కువ ఆప్షన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు కమెడియన్స్ కొరత ఏర్పడింది. ప్రస్తుతం కమెడియన్స్ ఎవరున్నారబ్బా అని ఆలోచన వచ్చినప్పుడల్లా.  ముందుగా వెన్నెల కిషోర్, సత్యాలాంటి వాళ్లు మాత్రమే గుర్తుకు వస్తూ ఉంటారు. వీళ్ళిద్దరిని చూడగానే ప్రేక్షకులకు కూడా ఆటోమేటిగ్గా నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో అయితే సత్య వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీ కమెడియన్ గా మారిపోయాడు. సినిమాలు ఫ్లాప్ అయినా  సినిమాల్లో సత్య కామెడీ మాత్రం సూపర్ హిట్ అవుతుంది. ఇటీవల మిస్టర్ బచ్చన్ విషయంలో కూడా ఇలాగే జరిగింది.



 ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 ప్రమోషన్స్ కోసం కూడా సత్యాని వాడుకుంటున్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో డిమాండ్ ను బట్టి పారితోషకం కూడా ఉంటుంది. దీంతో సత్య ఒక్కరోజు కాల్ షీట్ కోసం ఎంత తీసుకుంటాడో అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఒక్కరోజు కాల్ షీట్  కోసం ఏకంగా 2 లక్షల రూపాయలు నిర్మాతలు సత్యకి చెల్లిస్తారట. అంటే నెల రోజులు ఆయన ఒక్క సినిమా కోసం పనిచేస్తే 60 లక్షలు ఇవ్వాలన్నమాట.  ఇలా ఒక్క రోజుకు రెండు లక్షల రెమ్యునరేషన్   తీసుకోవడం అంటే అది చిన్న విషయం కాదని.  అతను జబర్దస్త్ లో సాదాసీదా కమెడియన్ స్థాయి నుంచి ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ స్థాయికి ఎదిగాడని అభిమానులు గర్వపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: