నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ఆఖరి 7 మూవీలకి జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసు కుందాం.

నాని తాజాగా సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా ఆగస్టు 29 వ తేదీన థియేటర్లో విడుదల అయింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ప్రియాంక అరుణ్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఎస్ జె సూర్య ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు.

నాని పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో హాయ్ నాన్న అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 27.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

నాని పోయిన సంవత్సరం దసరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

నాని హీరోగా రూపొందిన అంటే సుందరానికి మూవీ కి 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు.

నాని హీరో గా రూపొందిన శ్యామ్ సింగరాయ్ మూవీ కి 22 కోట్ల ప్రి రిలీజ్ జరిగింది. ఈ మూవీ కి రాహుల్ సంకుర్తియన్ దర్శకత్వం వహించాడు.

నాని హీరోగా రూపొందిన గ్యాంగ్ లీడర్ మూవీ కి 28 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు.

నాని హీరోగా రూపొందిన జెర్సీ సినిమాకు 26 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి గౌతం తిన్ననూరి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: