నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కించిన రెండో చిత్రం “సరిపోదా శనివారం” కోసమే అని చెప్పాలి. వీరి కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రం ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సినిమా ఫ్యాన్స్ వీరి కాంబినేషన్ లో ఒక హిట్టు పడితే ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటున్నారు. మరి అందుకు తగ్గట్టుగానే “సరిపోదా శనివారం” డే 1 నుంచి కూడా ఓ రేంజ్ లో హైప్ ని సెట్ చేసుకుంది. అప్డేట్ అప్డేట్ తో సినిమాపై బజ్ పెరిగిందే కానీ ఎక్కడా తగ్గలేదు అని చెప్పడంలో సందేహం లేదు. ఆన్ టైం షూటింగ్ కంప్లీట్ అవ్వడం నుంచి ఇప్పుడు థియేటర్స్ లోకి సినిమా రావడం వరకు మేకర్స్ అంతా పర్ఫెక్ట్

 గానే చేసేసారు. అయితే ఇందులో చాలా మందికి తెలియని విషయం నానిసినిమా విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడు. ఇదిలా ఉంటే సరిపోదా శనివారం పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గురువారం రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పడిపోయాయి. అవి చూసిన నెటిజన్స్ సరిపోదా శనివారంపై రివ్యూలు ఇస్తున్నారు. సినిమాలో హీరో ఎంట్రీతో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని, గూస్ బంప్స్ తెప్పించాయని అంటున్నారు. నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ నటించారు.

పాన్ ఇండియా భాషల్లో గట్టి ప్రమోషన్ల నడుమ విడుదలైన ఈ చిత్రం భారీ బుకింగ్స్ ని తెలుగు రాష్ట్రాలతో సహా యూఎస్ మార్కెట్ లో కూడా నమోదు చేస్తుంది. అయితే ఈ చిత్రం అమెరికా మార్కెట్లో అదరగొడుతుందనే చెప్పాలి. నాని నిలకడ క్రేజ్‎తో సాలిడ్ ప్రీ సేల్స్ బుకింగ్స్ అందుకుంది. ఈ చిత్రం ఇప్పుడు కేవలం ప్రీ సేల్స్ తోనే హాఫ్ మిలియన్ మార్క్ దగ్గరకు వెళ్లిపోయింది. అక్కడ ఏకంగా నాలుగు లక్షల 50 వేల డాలర్లు కి పైగా వసూళ్లు సాధించింది. ఇది భారీ మొత్తమే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి డే1 నుంచి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. మరి ఈ సినిమాకి జేక్స్ బిజొయ్ సంగీతం అందించారు. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: