కొన్ని సంవత్సరాల క్రితం ఇండియన్ ఆడియన్స్ ఓ టి టి కంటెంట్ ఎక్కువగా చూసేవారు కాదు. కానీ ఎప్పుడైతే దేశంలోకి కరోనా ఎంటర్ అయిందో దానితో దేశం లోని థియేటర్లు అన్నీ కూడా కొంత కాలం మూత పడ్డాయి. అలాగే టీవీ ఛానల్ లో కూడా కొత్త కంటెంట్ చూడడానికి ఏదీ లేదు. దానితో ప్రేక్షకులు అంతా ఓ టీ టీ లో ఉన్న కంటెంట్ ను చూడడం మొదలు పెట్టారు. దానితో చాలా మంది జనాలు ఓ టీ టీ లకు అలవాటు పడిపోయారు. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాలు నేరుగా ఓ టీ టీ లో విడుదల కావడం , అలాగే మరి కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అయిన చాలా తక్కువ కాలం లోనే ఓ టీ టీ లోకి రావడంతో జనాలు కొన్ని సినిమాలను థియేటర్లలో చూడడం కంటే కూడా ఓ టీ టీ లో ఫ్రీ గా చూసేయొచ్చు అనే ఉద్దేశంకి వచ్చేసారు.

దానితో కొన్ని సినిమాలు బాగున్న థియేటర్లలో పెద్దగా కలెక్షన్లను రాబట్టడం లేదు. అలాంటి సినిమాలకు ఓ టీ టీ లో మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇకపోతే చాలా వరకు సినిమాలు థియేటర్లలో విడుదల అయిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ఓ టీ టీ లోకి వస్తున్నాయి. కానీ చాలా రోజుల క్రితం విడుదల అయిన కొన్ని సినిమాలు ఇప్పటికీ కూడా ఓ టీ టీ లోకి రాలేదు. చాలా కాలం క్రితం అక్కినేని అఖిల్ "ఏజెంట్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

సినిమా విడుదల అయిన తర్వాత సోనీ లీవ్ ఓ టి  టి ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి రానున్నట్లు అఫీషియల్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. కానీ ఈ మూవీ ఇప్పటివరకు ఓ టీ టీ లోకి రాలేదు. ఇకపోతే తమిళ నటుడు శివ కార్తికేయన్ కొంత కాలం క్రితం ఆయలాన్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. మూవీ తెలుగు వర్షన్ ఇప్పటికీ ఓ టీ టీ లోకి రాలేదు. మరి ఈ రెండు సినిమాలు ఎప్పుడు తెలుగు భాషలో ఓ టీ టీ లోకి వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: