ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 10 సినిమాలలో తొమ్మిది హిందీ సినిమాలే ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క సౌత్ సినిమా ఉంది. కానీ ఆ సౌత్ సినిమా కూడా ఏకంగా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఆ సినిమా ఏదో తెలుసుకుందాం.

కొన్ని రోజుల క్రితం తమిళ నటుడు విజయ్ సేతుపతి "మహారాజా" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ తమిళ్ , తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి. తమిళ్ ఇండస్ట్రీ లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే ప్రముఖ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మూవీ కి నెట్ ఫ్లిక్స్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ఈ సంవత్సరంలో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాలలో ఈ మూవీ మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో 19.7 మిలియన్ న్యూస్ ను దక్కించుకొని ఈ సంవత్సరంలో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల లిస్టు లో మొదటి స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: