సీనియర్ నటుడు సాయికుమార్ కొడుకు ఆది సాయి కుమార్ ఇండస్ట్రీకి పరిచయం అయిన సినిమా ప్రేమకావాలి. 2011లో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మంచి హిట్‌ను అందుకుంది. డైరెక్టర్ విజయ్ భాస్కర్ ఆది సాయి కుమార్‌కు మంచి హిట్ అందించారని చెప్పాలి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. అందుకే ప్రతి సాంగ్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ మూవీ పాటలు ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ఇకపోతే ఈ మూవీలో ఆది సాయి కుమార్‌కు జోడీగా ఇషా చావ్లా నటించింది. ప్రేమకావాలి మూవీతో తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ప్రేమకావాలి మూవీ తర్వాత ఇషా చావ్లాకు యూత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పాలి. తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో మంచి టాక్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రేమకావాలి మూవీ తర్వాత ఆ బ్యూటీకి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఐదు తెలుగు సినిమాలు, ఒక కన్నడ సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే ప్రేమకావాలి తర్వాత ఆమెకు సరైన హిట్టు దక్కలేదు. దీంతో ఆఫర్లు లేక ఈ బ్యూటీ ఇండస్ట్రీకి దూరమైంది. కొంత కాలం బ్రేక్ తీసుకున్నాక ఇప్పుడిప్పుడే ఈ అమ్మడు సినిమా ఛాన్సుల కోసం ట్రై చేస్తోంది.

ఇషా చావ్లా కెరీర్ తీసుకుంటే ఆమె 2014 నుంచి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. చిరు, డైరెక్టర్ వశిష్ట కాంబోలో విశ్వంభర తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలోనే ఇషా చావ్లా నటిస్తున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్, త్రిష, సురభి లాంటి స్టార్స్ నటిస్తున్నారట. వాటితో పాటు ఇషా చావ్లా కూడా స్పెషల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతోనైనా ఆమెకు సరైన అవకాశాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫోటోలకు అందంలో ఏమాత్రం తగ్గలేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: