అల్లు అర్జున్‌ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం‌ ‘పుష్ప2 :ది రూల్‌’. మూడేళ్ల క్రితం ఇదే కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్పకు ఇది సీక్వెల్. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన ఈ క్రేజీ మూవీ కొన్ని కారణాలతో డిసెంబర్ 6కు వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించిన కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరో 100 రోజుల్లో ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా చిత్రబృందం ఒక పవర్ ఫుల్ పోస్టర్‌ షేర్‌ చేసింది. ‘

‘మరో వంద రోజుల్లో అతడి రూల్ చూడనున్నారు. అద్భుతమైన అనుభూతిని పొందేందుకు రెడీగా ఉండండి’’ అని పుష్ప 2 టీమ్ పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఇందులో బన్నీ లుక్ హైలెట్ గా నిలిచింది. మరోవైపు ఈ సినిమా తర్వాత బన్నీ చేయబోయే చిత్రం గురించి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమిళ అగ్ర దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్‌ భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను తెరకెక్కించనుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అధికారిక ప్రకటనకు రంగం సిద్ధమైందని తెలిసింది. మరో వారం రోజుల్లో నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. 'పుష్ప' చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా అవతరించారు అగ్ర హీరో అల్లు అర్జున్‌. ఇక 'జవాన్‌’ చిత్రంతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు తమిళ దర్శకుడు అట్లీ. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అభిమానులకు ఇక పండగే అనుకోవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: