తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఏకంగా బాలయ్య సరసన ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ లు హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటివరకు ఈ మూవీ మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.

దానితో ఈ మూవీ బాలయ్య కెరియర్లో 109 వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ ని "N B K 109" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ పూర్తి చేస్తూ వస్తుంది. అలాగే ఈ సినిమా యొక్క విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించలేదు. ఇలా ఈ మూవీ టైటిల్ ను ప్రకటించకపోవడం , ఈ మూవీ విడుదల తేదీని అనౌన్స్ చేయకపోవడంతో ఈ రెండు విషయాలపై అనేక వార్తలు పుట్టుకస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. కొంత కాలం క్రితం వరకు ఈ సినిమాను అక్టోబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ కాగా , ఆ తర్వాత ఈ మూవీ ని డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అయింది.

ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుక విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ఈ మూవీ విడుదల తేదీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడంతో బాలయ్య అభిమానులు ఈ మూవీ నిర్మాణ సంస్థపై గుర్రుగా ఉన్నారు. త్వరగా ఏదో ఒక విడుదల తేదీని అనౌన్స్ చేస్తే బెటర్ అని వారు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: