మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా బి గోపాల్ దర్శకత్వంలో ఇంద్ర అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించాడు. 2002 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అప్పటివరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంత గొప్ప విజయం సాధించిన ఈ సినిమాను ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

తాజాగా ఈ మూవీ కి పని చేసిన కొంత మంది టెక్నీషియన్స్ ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. తాజాగా ఈ సినిమా హీరో అయినటువంటి చిరంజీవి , ఈ మూవీ దర్శకుడు బి గోపాల్ , నిర్మాత అశ్విని దత్ , కథ రచయిత చిన్ని కృష్ణ , మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్ , సంగీత దర్శకుడు మణిశర్మ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను మాట్లాడుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమా రన్ టైమ్ గురించి చెప్పుకొచ్చారు.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఈ మూవీ యొక్క రన్ టైం 3 గంటల 20 నిమిషాలు వచ్చినట్లు , దానితో వెంటనే కంగారు పడిపోయి ఇందులో నుండి 25 నిమిషాల వరకు ఎడిట్ చేసి తీసేయాలి అని మూవీ బృందం అనుకున్నారట. దానితో చిరంజీవి కూర్చొని ఈ సినిమా మొత్తాన్ని చూసి అందులో నుండి 25 నిమిషాలకు తీసేసినట్లు చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ మూవీ కి చిన్ని కృష్ణ కథను అందించగా , పరుచూరి బ్రదర్స్ మాటలను అందించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: