గత కొంతకాలంగా మెగా vs  అల్లు కుటుంబం అనే విధంగా గొడవలు జరుగుతున్నాయి.అయితే ఈ గొడవలు ఇప్పుడు రాజకీయంగా కూడా రోజురోజుకు ముదిరేలా చేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు. నిన్నటి రోజున పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉంటున్న ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ పైన చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ఇవి మరువకముందే ఇప్పుడు తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం జనసేన పార్టీ నేత చలమనశెట్టి రమేష్ బాబు అల్లు అర్జున్ పైన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.


చలమ శెట్టి మాట్లాడుతూ మేమందరం కూడా చిరంజీవి అడుగుజాడలలో నడుస్తూ ఉన్నాము.. మెగా కుటుంబం నుంచి వచ్చిన అల్లు అర్జున్ ఇంత హీనంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఆయన ఫైర్ అయ్యారు.. ఇది ఇలాగే కొనసాగితే పుష్ప-2 సినిమా గన్నవరంలో విడుదల కానివ్వకుండా అడ్డుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. అసలు అల్లు అర్జున్ హీరోనే కాదు ఒక కామెడీ యాక్టర్ అంటూ ఫైర్ అయ్యారు. హీరో అంటే రామ్ చరణ్ అతడిని చూసి నేర్చుకోవాలి అంటూ వైర్ కావడం జరిగింది చలమన శెట్టి రమేష్ బాబు.


మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయరు ఎవరికీ కూడా సహాయం చేయరు.. అలాంటిది మీరు ఇలా మాట్లాడేదా అంటూ ఫైర్ అయ్యారు..చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కాళ్లు కడిగిన నీటిని మీరు మీడియా ముందుకు వచ్చి నెత్తిన చల్లుకుంటేనే మిమ్మల్ని క్షమిస్తాం అంటూ ఫైర్ అయ్యారు. లేకపోతే పుష్ప-2 సినిమాని ఆడనివ్వమంటూ ఆయన చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. దీంతో అల్లు అర్జున్ అభిమానులు సైతం జనసేన నేతలకు దిమ్మతిరిగిపోయే కౌంటర్లు వేస్తున్నారు.. అసలు ఎవరు ఏమి మాట్లాడినా కూడా అన్ని రాజకీయంగా చేస్తున్నారు.. మీరా ఇలాంటి మాటలు చెప్పేది అంటూ ఫైర్ అవుతున్నారు. తమ అభిమాన హీరో సినిమాల గురించి మాట్లాడిన మెగా కుటుంబాన్ని ఉద్దేశించే మాట్లాడుతున్నారనే విధంగా చేస్తున్నారు రాబోయే రోజుల్లో కచ్చితంగా అభిమానులు, ప్రజలే బుద్ధి చెబుతారని ముందు కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చండి అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: